Posts

Showing posts from November, 2019

సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు

Image
సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు  గత కొంతకాలంగా తెలుగుదేశం హిందూ మతవాదం అందుకోవాలని కొందరు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రిష్టియన్ కావటంతో హిందుత్వ నినాదం తెలుగుదేశం పార్టీకి రాజయకీయంగా లాభం చేస్తుంది అని వారి వాదన. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా క్రిష్టియన్ అయిన వైవి సుబ్బారెడ్డి నియమించడం, తిరుమలలో అన్యమత ప్రచారం, గ్రామ సచివాలయంలో క్క్రైస్తవ ప్రార్థనలు లాంటి విషయాలు ఈ మధ్యన వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఒక మతం మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు నిరసన వ్యక్తం చేయటంలో తప్పు లేదు. అయితే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుని జగన్ మోహన్ రెడ్డి ని ఇరకాటం లో పెట్టాలి అనే వాదనలో అంతగా పసలేదు. హిందుత్వ వాదానికి ప్రతినిధిగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఉంది. వారు జగన్ పై ఈ అస్త్రాన్ని వాడటానికి ఇప్పటికే పని మొదలు పెట్టారు. ఇపుడు తెలుగుదేశం పార్టీ ఈ వాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళితే అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుంది తప్ప తెలుగుదేశానికి వచ్చే ఉపయోగం లేదు. 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గుళ్ళ చుట్టూ తిరిగి తన జంధ్యాన్ని ప్రద

రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ?

Image
రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ? : 24/7 న్యూస్ ఛానెల్స్ వచ్చిన కొత్తలో అందరూ సంతోషించారు. రాజకీయ నాయకుల మీద నిరంతర నిఘా ఉంటుంది వారి నిబద్ధత, బాద్యత పెరుగుతాయి అనుకున్నారు. కానీ ప్రస్తుత టివి చర్చల స్థాయి  చాలా దారుణంగా ఉంది. ఈ విషయంలో తప్పు ఎవరిది ?  పార్టీలదా ? పార్టీ అధ్యక్షులదా  ? లేక టీవీ యాంకర్లదా ? వీళ్ళలో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా తయారయ్యింది ఈ వ్యవహారం. పరుష పదజాలం మాట్లాడే వారిని పార్టీలు కట్టడి చేయకపొగా ప్రోత్సహిస్తున్నాయి. టీవీ చానెళ్లు కూడా వారి టీఆర్పీల కోసం అలంటి వారిని డిబేట్లకి పిలుస్తున్నాయి. ఇటీవల వల్లభనేని వంశి - బాబు రాజేంద్రప్రసాద్ల మధ్య tv9 ఛానెల్లో జరిగిన చర్చ వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారింది. టీ స్టాళ్లలో జరిగే చర్చలు ఇంతకన్నా మెరుగు అన్న స్థాయిలో వారి చర్చ సాగింది. ఇదే వల్లభనేని వంశి గన్నవరం వైసిపి అభ్యర్థిని బెదిరించినపుడు టిడిపి వాళ్ళు అతన్ని హీరో అన్నారు, వైసిపి వారు అతనికి ప్రజాస్వామ్య విలువలు తెలియవు అని విమర్శించారు. ఇవాళ టీడీపీ వాళ్ళు  వంశి భాషని విమర్శిస్తుంటే వైసిపి వారు సమర్థిస్తున్నారు. బాబు రాజేంద్

తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ

Image
తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ RTC ఇక ముగింపే..వాళ్ళ కడుపు వాళ్లే కొట్టుకున్నారు - కెసిఆర్  ప్రైవేట్ బస్సులు లాభాల్లో ఉన్నాయ్, మరి RTC నష్టాల్లో ఎందుకు ఉంది... ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి అంటే...4 బస్టాండ్లు అమ్మివేయాలి... ఈ వ్యాఖ్యలు చేసిన  కెసిఆర్ ను తల వంచని ధీరుడుగా మీడియా చూపిస్తుంది ఆ వార్తలు చదివాక, ఒక పార్టీ మద్దతుదారుడుగా కాదు...ఎన్నో సవంత్సరాలు RTC బస్సును ఎక్కినవాడిగా, ఎంతో కాలంగా వాళ్ళని చూస్తున్నవాడిగా నా స్పందన ఇది.. ఏదన్నా ప్రభుత్వ అనుబంధ సంస్థ కాలానుగుణంగా మారుతూ  ప్రజలకి  అత్యంత చేరువుగా ఉంది అంటే అది ఒక్క RTC మాత్రమే, .ఒకప్పుడు ఒక బుస్సుకి ఒక డ్రైవర్, ఒక కండక్టర్, ఒక క్లీనర్ ఉండేవాడు....ఈరోజు ఆ పనులు అన్ని ఒక్క డ్రైవెర్ చేస్తున్నాడు.... 6 చేతులు చేసే పనిని 2 చేతులు చేస్తున్నాయి....ఇంతగా మారి 3 పనిని ఒక మనిషి చేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏదన్న ఉందా ? RTC ఒక ప్రైవేట్ సంస్థ తో పోల్చిన అత్యున్నత సంస్థ...యాక్ససిడెంట్స్ పరంగాచూసినా, వాళ్ళ పనితనంలో చూసినా, వాళ్ళ నిబద్ధతలో చూసిన ఏ సంష్త వాళ్ళ దరిదాపుల్లోకి రాదు. ఈరోజు మెరుగైన సేవలు కోసం దానిని ప్రైవేట్ పరం చేస్త

అష్టదిగ్భంధనంలో చంద్రబాబు

Image
అష్టదిగ్భంధనంలో చంద్రబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు పడ్డారు. అయితే ఆ పని అంత సులువుగా అయితే అయ్యేలా కనపడటం లేదు . చంద్రబాబు ముందున్న సవాళ్ల చిట్టా ఒకసారి పరిశీలిద్దాం : జగన్ : జగన్ చంద్రబాబుల శత్రుత్వం గురించి కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జగన్ మోహన్ రెడ్డి తో పోరాటం అంత ఆషామాషీ విషయం కాదు. భాజపా/మోదీ : 2019 ఎన్నికల్లో చంద్రబాబు జగన్ కన్నా ఎక్కువ విమర్శించింది మోదినే అనటం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ విషయం చంద్రబాబు మర్చిపోయినా మోదీ అంత తొందరగా మర్చిపోయే అవకాశం లేదు కేసీఆర్ : 2018 లో తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు పై కేసీఆర్ కన్నెర్ర చేశారు. వారిద్దరి మధ్య స్నేహానికి దారులు దాదాపు మూసుకు పోయినట్టే. పవన్ : పై ముగ్గురితో పోల్చుకుంటే చంద్రబాబు పవన్ ని విమర్శించింది తక్కువ అనే చెప్పాలి. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో స్నేహం చేయటానికి పవన్ కొంచం జంకుతున్నట్టుగా కనపడుతుంది. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి వేచి చూసే దోరణి లో పవన్ ఉన్నారు అని అర్థం

What decides privilege in India ?

Image
What decides privilege in India ? Recently SP Balasubrahmanyam has put up a facebook post explaining how he was asked to submit his cellphone before meeting the Prime Minister. He wondered how bollywood stars were talking selfies with the PM in the same event. Well, its no wonder that the selfies with bollywood stars was a choreographed PR exercise. The PR team picked a bunch of popular and privileged people including Shah Rukh Khan, Aamir Khan to take selfies with the PM. Photographs of these moment of intimacy between the PM and bollywood stars were all over the news next day.The purpose was achieved : More Publicity for the PM as if there wasn't enough already . There is one key element to all this drama which became controversial, the stars were allowed to take their cellphones with them while meeting the PM. Usually people who meet the PM has to submit their cellphones to the Special Protection Group (SPG) before meeting the PM. SP Balasubhramanyam (SPB), the legendary pl

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?

Image
బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా ? భాష- మనిషి తన భావాలు వ్యక్తీకరించడానికి , సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి కనుక్కున్న ఒక మాధ్యమం. ఏ మనిషికైనా తన మొదటి మాటలు , మొదటి భావాలు , ఆలోచనా విధానం ఏ భాషలొ మొదలవుతాయో అదే తన మాతృభాష. అలా ప్రతి జాతికి ఒక మాతృభాష ఉంటుంది. ఒక జాతి అస్తిత్వం , సంస్కృతి , సాంప్రదాయం అన్నీ చాలావరకు మాతృభాషతోనే ముడిపడిఉంటాయి. అలాగే మాతృభాషలో విద్యాబోధన కూడా ఆ జాతి మనుగడకు చాలా అవసరం. గతవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఆంగ్ల మాధ్యమ నిర్ణయం తెలుగు భాష అస్తిత్వానికే పెద్ద ముప్పుగా మారుతుంది. ప్రభుత్వం చెప్తున్న కారణాలు: ఒక సారి పరిశీలిద్దాం 1) తెలుగు మాధ్యమం లో చదివితే ఉద్యోగాలు రావు - ఇవ్వాళ పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు వాళ్ళ మాతృభాషలో చదువుకొన్నవారే. అందరూ ఇంగ్లిష్ ని తర్వాత నేర్చుకున్నవాళ్ళే. కొంతమందికి ఇంగ్లిష్ సరిగ్గా రాక సమస్యలొచ్చుండవచ్చు. అది ఇంగ్లిష్ నేర్చుకోని వాళ్ళ తప్పే తప్ప తెలుగు మాధ్యమ తప్పు కాదు. మనం సాఫ్ట్ వేర్ డాక్టర్ ఉద్యొగాలే ఉన్నాయ్ చాలావరకు అనుకోవడం వల్ల వచ్చే ఇబ్బందే ఇది. ఇంగ్లిష్ పెద్దగా అవసరం పడన