రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ?

రాజకీయ నాయకుల విమర్శలకు పరిమితులు లేవా ? :

24/7 న్యూస్ ఛానెల్స్ వచ్చిన కొత్తలో అందరూ సంతోషించారు. రాజకీయ నాయకుల మీద నిరంతర నిఘా ఉంటుంది వారి నిబద్ధత, బాద్యత పెరుగుతాయి అనుకున్నారు. కానీ ప్రస్తుత టివి చర్చల స్థాయి  చాలా దారుణంగా ఉంది. ఈ విషయంలో తప్పు ఎవరిది ?  పార్టీలదా ? పార్టీ అధ్యక్షులదా  ? లేక టీవీ యాంకర్లదా ?

వీళ్ళలో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా తయారయ్యింది ఈ వ్యవహారం. పరుష పదజాలం మాట్లాడే వారిని పార్టీలు కట్టడి చేయకపొగా ప్రోత్సహిస్తున్నాయి. టీవీ చానెళ్లు కూడా వారి టీఆర్పీల కోసం అలంటి వారిని డిబేట్లకి పిలుస్తున్నాయి.

ఇటీవల వల్లభనేని వంశి - బాబు రాజేంద్రప్రసాద్ల మధ్య tv9 ఛానెల్లో జరిగిన చర్చ వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారింది. టీ స్టాళ్లలో జరిగే చర్చలు ఇంతకన్నా మెరుగు అన్న స్థాయిలో వారి చర్చ సాగింది. ఇదే వల్లభనేని వంశి గన్నవరం వైసిపి అభ్యర్థిని బెదిరించినపుడు టిడిపి వాళ్ళు అతన్ని హీరో అన్నారు, వైసిపి వారు అతనికి ప్రజాస్వామ్య విలువలు తెలియవు అని విమర్శించారు. ఇవాళ టీడీపీ వాళ్ళు  వంశి భాషని విమర్శిస్తుంటే వైసిపి వారు సమర్థిస్తున్నారు. బాబు రాజేంద్రప్రసాద్ కూడా తక్కువ వాడు కాదు, అడ్డంగా వాదించటంలో ఆయనకి ఆయనే సాటి.



తిలా పాపం తలా పిడికెడు : 

టిడిపి అధికారంలో ఉన్నపుడు జగన్ ని తిట్టడానికి అచ్చెన్నాయుడు, బోండా ఉమా, దేవినేని ఉమాలని ప్రయోగించాయి. ఇపుడు వైసిపి చంద్రబాబుని తిట్టడానికి కోడాలి నాని వల్లభనేని వంశి లాంటి వారిని ప్రయోగిస్తున్నాయి. కొడాలి నాని వాడే భాష మంత్రి స్థాయిలో కాక విధి రౌడీ మాదిరిగా ఉంటుంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఆవేశంగా ఊగిపోతూ వ్యక్తిగత విమర్శలకి దిగుతారు. అయితే తన దాక వచ్చేసరికి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అని నీతిసూక్తులు వల్లిస్తారు.

అయితే రాజకీయ నాయకులందరూ అలానే ఉంటారు అనుకోవడం పొరపాటు. పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్ రావ్ లాంటి వారు సబ్జెక్ట్ పై మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకి దిగకుండా జాగ్రత్త పడతారు. టివి ఛానళ్లు ఇలాంటి వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తే మిగిలిన వారిలో కొంతైనా మార్పు వస్తుంది.


Comments

Popular posts from this blog

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?

సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు

తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ