తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ

తెలంగాణ రోడ్డుపై రవాణా సంస్థ

RTC ఇక ముగింపే..వాళ్ళ కడుపు వాళ్లే కొట్టుకున్నారు - కెసిఆర్ 
ప్రైవేట్ బస్సులు లాభాల్లో ఉన్నాయ్, మరి RTC నష్టాల్లో ఎందుకు ఉంది...
ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి అంటే...4 బస్టాండ్లు అమ్మివేయాలి...

ఈ వ్యాఖ్యలు చేసిన  కెసిఆర్ ను తల వంచని ధీరుడుగా మీడియా చూపిస్తుంది
ఆ వార్తలు చదివాక, ఒక పార్టీ మద్దతుదారుడుగా కాదు...ఎన్నో సవంత్సరాలు RTC బస్సును ఎక్కినవాడిగా, ఎంతో కాలంగా వాళ్ళని చూస్తున్నవాడిగా నా స్పందన ఇది..

ఏదన్నా ప్రభుత్వ అనుబంధ సంస్థ కాలానుగుణంగా మారుతూ  ప్రజలకి  అత్యంత చేరువుగా ఉంది అంటే అది ఒక్క RTC మాత్రమే, .ఒకప్పుడు ఒక బుస్సుకి ఒక డ్రైవర్, ఒక కండక్టర్, ఒక క్లీనర్ ఉండేవాడు....ఈరోజు ఆ పనులు అన్ని ఒక్క డ్రైవెర్ చేస్తున్నాడు.... 6 చేతులు చేసే పనిని 2 చేతులు చేస్తున్నాయి....ఇంతగా మారి 3 పనిని ఒక మనిషి చేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థ ఏదన్న ఉందా ?


Auto-rickshaw and cabs also stayed off the roads as their unions also announced an indefinite strike from Saturday in solidarity with the agitating RTC workers.

RTC ఒక ప్రైవేట్ సంస్థ తో పోల్చిన అత్యున్నత సంస్థ...యాక్ససిడెంట్స్ పరంగాచూసినా, వాళ్ళ పనితనంలో చూసినా, వాళ్ళ నిబద్ధతలో చూసిన ఏ సంష్త వాళ్ళ దరిదాపుల్లోకి రాదు. ఈరోజు మెరుగైన సేవలు కోసం దానిని ప్రైవేట్ పరం చేస్తాం అంటున్నారు. ఆ ప్రైవేట్ సంస్థలు లాభాలు వచ్చే రూట్లు కాకుండా నష్టాలూ వచ్చే రూట్లు బుసలు తిప్పుతాయా ?ప్రైవేట్ బుసలు రైతులు కొసం, రైతు బజార్లు కొసం బస్సులు వేస్తాయా ?  వృద్దులకు రేపు ప్రైవేట్ప్రై సంస్థలు  రేట్లు తగ్గించమంటే తగ్గిస్తాయా ? ప్రైవేట్ సంస్థలు గుత్తాధిపత్యం పెంచుకొని టిక్కెట్లు రేట్లు పెంచకుండా ఉంటాయా ? ప్రైవేట్ బస్సులు రేపు గుత్తాధిపత్యం తెచ్చుకొని ప్రభుత్వాలని బెదిరించవా ?

RTC నష్టాల్లో ఉంది అంటే అది ప్రభుత్వం, పాలకుల తప్పు కాదా ?

ఎన్నో సవంత్సరాలుగా RTC ని పాలకులు వారి అవసరాలు కొసం వాడుకున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో పల్లెటూర్లకి బస్సులు వేస్తాం అని వాగ్దానం చేస్తే. RTC వాళ్ళు లాభాలు రావు, కుదరదు  అన్నా వేయించారు.ఏదైనా రాస్తారోకో చేస్తే ఆందోళనకారులు  మొదట కోపం చూపించేది RTC బస్సులు మీదే. ప్రభుత్వంలో ఉన్న పార్టీ సమేవేశాలు అంటే మీకు గుర్తుకు వచ్చేది RTC బస్సులే,  RTC బస్స్టాండ్లోనూ ప్రభుత్వ పెత్తనమే...ఇలా వాళ్ళని ఎక్కడికి అక్కడ దెబ్బతీసి ఈరోజు మీరు నష్టాల్లో ఉన్నారు మిమ్మల్ని మూసేస్తాం అంటే...అది ఎవరి చేతగానితనం ?

అహంకారపు మాటలు, విజయం తలకి ఎక్కినా పొగరుతో ఏమి మాట్లాడిన చెల్లబోతుంది అని అనుకోవచ్చు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలకి చూపించాల్సిన మీడియా...ప్రభుత్వానికి వంత పాడటం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ప్రభుత్వ అవసరాల కొసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు కొసం RTC ని వాడుకొని, నష్టపరిచి. ఈరోజు నోరు ఎత్తితే మీ కడుపు కొడతా అనటం, దానికి కొంతమంది వంత పాడటం చూస్తుంటే మనం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో తెలుస్తుంది. ఈరోజు ఇది రేపు ఇంకోటి...నాకు వక్కచాతుర్యం ఉంది..ఏది మాట్లాడిన చెల్లుతుంది...మీడియా పైన పట్టు ఉంది...నన్ను ఎవరు ప్రశ్నించారు అనుకుంటే ఆ అహం ఎన్నో రోజులు నిలవదు. మహామహులనుకున్న నాయకులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఆర్టీసీకి రాజకీయ పార్టీలే కాకుండా ప్రజలు కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. వారి డిమాండ్లలో సాధ్యమైనవి పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వం పై పౌర సమాజం ఒత్తిడి పెంచాలి-


Comments

Popular posts from this blog

బ్రతకాలంటే మాతృభాషని వదిలెయ్యాల్సిందేనా?

సాఫ్ట్ హిందుత్వ వద్దు ఆత్మగౌరవమే ముద్దు